కొయ్యూరు: జగనన్న గెలుపుకై వినూత్న రీతిలో ప్రచారం.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో వైసీపీ పార్టీ అభిమాని పాటి చంద్రశేఖర్ జగనన్న గెలుపు కోసం వినూత్న రీతిలో ప్రచారం చేశారు.జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న సిద్ధం స్టిక్కర్ ను వెనకాల వీపు భాగంలో అంటించుకుని వినూత్న ప్రచారం చేశారు.ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి మద్దతునిస్తూ.. వైసీపీ పార్టీ బలపరిచిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు ను, అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మా తనూజారాణి ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.