కొయ్యూరు: జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రేవళ్ళు పంచాయితీ లోని రేవళ్ళు,ఆర్ కంటారం,శాంతినగరం,బూరుగుపాలెం,మంప,కించవానిపాలెం గ్రామాల్లో మండల వైసీపీ నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు ను, అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మా తనూజారాణి ని ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ నెంబర్ 4లో ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్,మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు,ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, వైస్ ఎంపీపీలు అప్పన వెంకటరమణ,అంబటి నూకాలమ్మ,జేసీఎస్ కన్వీనర్ బండి సుధాకర్, జిల్లా కార్యదర్శి గాడి సత్యనారాయణ, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసిలి నాయుడు,పెద మాకవరం ఎంపీటీసీ సడ్డా మల్లీశ్వరి,మండల మహిళా అధ్యక్షురాలు సడ్డా సావిత్రి,ఎం.మాకవరం సూపర్ సర్పంచ్ కోడా రాజుబాబు, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ గాడి అచ్చిరాజు,రేవళ్ళు వార్డు మెంబర్ రాజులమ్మ, మండల నాయకులు పాటి శేఖర్,లాలం శేఖర్,మహేష్,గోకిరి చిన్నా,దూరి గంగరాజు,జన్ని నాగేంద్ర,కుశల తదితరులు పాల్గొన్నారు.