Breaking News

కొయ్యూరు: టిడిపి కార్యకర్తలు బిజెపిలో చేరిక.

0 32

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: మండలంలో టిడిపి పార్టీలో ముఖ్య నేతగా వ్యవహరించిన మేడిబోయిన చిన్నా తో సహా మొత్తం 25 మంది టిడిపి కార్యకర్తలు.. బిజెపి పార్టీ పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ కూడా కృష్ణారావు ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. టిడిపి,బిజెపి,జనసేన మూడు పార్టీలు కలిసి కూటమిగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీకు వస్తున్న తరుణంలో.. మూడు పార్టీలు ఒకటే అనేంతలా ముందుకు వెళుతున్న ఈ సందర్భంలో టిడిపి నేత బిజెపిలోకి వెళ్లడం వెనకాల ఆంతర్యం ఏమిటి? లేక టిడిపి సిద్ధాంతాలు నచ్చకనే ఈ నిర్ణయం తీసుకున్నారా?. పాడేరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి, బిజెపి నుండి ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత పోటీలో ఉన్న ఈ తరుణంలో టీడీపీ నుండి బీజేపీ లోకి వెళ్ళిన మేడిబోయిన చిన్నా వల్ల కేవలం బిజెపి ఎంపీ అభ్యర్థి అయిన కొత్తపల్లి గీత కే ఉపయోగం ఉండబోతోందా? లేక గిడ్డి ఈశ్వరి కి కూడా చిన్నా సపోర్ట్ చేస్తారా? లేదా?. మేడిబోయిన చిన్నా టిడిపి నుండి బిజెపిలోకి వెళ్లడానికి గల కారణం ఏమిటో ఈ సంకేతం ఏమిటి అనే మీమాంస నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.