Breaking News

50వేల రూపాయలతో నిత్యావసర వస్తువులు, సరుకులు పంపిణీ చేసిన ఎంపీపీ బడుగు రమేష్,ఎంఆర్ఓ తిరుమలరావు.

0 20

50వేల రూపాయలతో నిత్యావసర వస్తువులు, సరుకులు పంపిణీ చేసిన  ఎంపీపీ బడుగు రమేష్,ఎంఆర్ఓ తిరుమలరావు.


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పెదమాకవరం పంచాయతీ లోని గానుగుల గ్రామంలో దుచ్చరి సరస్వతి, దుచ్చరి బంగారయ్య, దుచ్చరి సింగారమ్మ అను వారి పూరిల్లులు దగ్ధమై‌ సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు మంగళవారం బట్టలు,వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు ఎంపీపీ బడుగు రమేష్, ఎంఆర్ఓ తిరుమలరావు పంపిణీ చేయడం జరిగింది.

ప్రభుత్వం నుండి ఇంత వేగంగా స్పందించి బాధిత కుటుంబాలకు అండగా కొండంత ధైర్యంగా ప్రభుత్వం చేపట్టిన పరిష్కారం నిలుస్తుందని బాధిత కుటుంబాలు తెలిపారు.

నిజంగా ఎప్పుడూ లేని విధంగా ప్రజాప్రతినిధులు గాని,అధికారులు గానీ మా పట్ల చూపిన ప్రేమ మమ్మల్ని ఓదార్పునిచ్చిందని బాధితులు అన్నారు.

 ఎంపీపీ గారు మాట్లాడుతూ.. ఇల్లు దగ్ధమైన విషయం తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చి వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తో,జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు వివరించడం జరిగిందని వెంటనే ఆ రోజు పాతికవేల రూపాయలు యుద్ధ ప్రాతిపాకన అకౌంట్లో వేయడం జరిగిందని అన్నారు.మరి నేడు 50 వేల రూపాయలుతో వారికి నిత్యావసర సరుకులు, బకెట్లు అలాగే వంట సామాగ్రి బట్టలు అందించి వారికి మా వైయస్సార్ ప్రభుత్వం తోడుగా ఉందని ఈరోజు మేము భరోసా ఇవ్వడం జరిగిందని రమేష్ అన్నారు.

ఇది ఒకటే కాదు భవిష్యత్తులో ఎక్కడ ఎటువంటి నష్టం జరిగిన వైయస్సార్ ప్రభుత్వం తరుపున కచ్చితంగా మేము ప్రతి కుటుంబానికి వర్గ విభేద వివక్షత లేకుండా పార్టీలు రాజకీయాలు చేయకుండా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా కులం చూడం మతం చూడం రాజకీయం చేయం అనే నినాదంతో మండలంలో ఎక్కడ ఇటువంటి  సంఘటనలు జరిగినా కచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరపున మేము అక్కడికి చేరుకొని తగు న్యాయం చేయడానికి 10 0 శాతం కృషి చేస్తామని తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ చడ్డా మల్లీశ్వరి, సర్పంచ్ సెగ్గే నూకాలమ్మ,వీఆర్వో పండయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.