Breaking News

లంబసింగి,తాజంగి వారపు సంతల్లో వైసీపీ ఎన్నికల ప్రచారం.

0 173

*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార హోరు.
*లంబసింగి,తాజంగి వారపు సంతల్లో ప్రచారం.


అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వర రాజు,ఎంపీ అభ్యర్థి డాక్టర్ గుమ్మా తనూజరాణి గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తూ వారపు సంతల్లో నేరుగా ఓటర్లను కలుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ వారి మద్దతు కోరుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో కూటమి అభ్యర్థులను గిరిజనులు తిప్పి కొట్టాలని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. గిరిజన ప్రాంతంలో అభివృద్ధి,సంక్షేమ ఫలాలు అందాలంటే అది జగనన్నతోనే సాధ్యం అంటూ రాష్ట్రంలో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇవ్వాలని ముమ్మర ప్రచారం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏపీ రాష్ట్ర ట్రై కార్ డైరెక్టర్ సుర్ల లోవరాజు,తాజంకి సర్పంచ్ పూజారి రాజేశ్వరి,కిటుముల పంచాయతీ సర్పంచ్ రమణమ్మ,చింతపల్లి మండల ప్రచార అధ్యక్షులు కేపరి రాంబాబు, తాజంగి పంచాయతీ కన్వీనర్ ఎక్స్ ఎంపీటీసీ కోరాబు అంగధర్ రావు, సీనియర్ నాయకులు వంతల బాబురావు,కిటుముల పంచాయతీ కన్వీనర్ కొర్రా సన్నాసి రావు,మాజీ సర్పంచ్ రామస్వామి,కిటుముల పంచాయతీ వాలంటీర్ల సెక్రటరీ పాటి కృష్ణ,నాయకులు రామారావు,సదా,భాస్కరరావు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.