Breaking News

కొయ్యూరు: నాలుగు రోజులుగా ఆగిపోయిన సెల్ టవర్ సేవలు.

0 172

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం:బాలారం పంచాయితీ లోని పాత బాలారం గ్రామంలో ఉన్న ఎయిర్టెల్ టవర్ సిగ్నల్స్ నాలుగు రోజులుగా పనిచేయడం లేదు.దీంతో సిగ్నల్స్ లేక అత్యవసర పరిస్థితుల్లో సమాచారం తెలుసుకొనేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని బాలారం వార్డు మెంబర్ గోవింద్ తెలిపారు.టవర్ వద్ద సరైన విధంగా మేనేజ్మెంట్ చేసే వ్యక్తులు కూడా ఎవరూ లేరని,ఇటువంటి సమయంలో ఎవరిని సంప్రదించాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు.

ఈ సెల్ టవర్ సేవలు వినియోగించుకునేందుకు బాలారం,కంటారం,కొమ్మిక,బకులూరు,ఆడాకుల ఇలా ఐదు పంచాయితీల నుండి సుమారుగా 10,000వేల మంది పైనే ఎయిర్టెల్ లోకి మారారని, కానీ నాలుగు రోజులుగా సిగ్నల్స్ ఆగిపోయినా ఎవరూ స్పందించే వారే లేరని గోవింద్ అన్నారు.సంబంధిత ఎయిర్టెల్ మేనేజ్మెంట్ వారు త్వరితగతిన సందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని వార్డు మెంబర్ గోవింద్,పలు పంచాయితీల ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.