Breaking News

101 బిందెలతో పసుపు కుంకుమతో మోదకొండమ్మ విగ్రహానికి అభిషేకంచేసిన గిడ్డి ఈశ్వరి.

0 167

అల్లూరి జిల్లా,పాడేరు:మన్య ప్రజల ఇలవేలుపు శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ విగ్రహానికి పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి మంగళవారం 101 బిందెలు పసుపు కుంకుమ నీళ్లతో అభిషేకం నిర్వహించారు.పాడేరు నియోజకవర్గంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలని మన్య ప్రజలంతా ఆయుష్షు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాలని కోరుకున్నారు.పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీటు తనకి రావాలని గతంలో మొక్కిన మొక్కులో భాగంగా పాడేరు మోదకొండమ్మ తల్లికి ఈ మొక్కు తీర్చుకోవడం జరిగిందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు నాగేశ్వరరావు,ఉషారాణి,వరలక్ష్మి,పులిగా గోపి,శాంతకుమారి,ఎస్ మణి బి బుజ్జీ,జీ రాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.