చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ కి ఘోర అవమానం.
ప్రోటోకాల్ మరిచిన అధికారులు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోని చౌడుపల్లి లో పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించిన చౌడుపల్లి -1,చౌడుపల్లి -2 గ్రామ సచివాలయాల్లో శిలా ఫలకం వద్ద చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ జైతి రాజులమ్మ పేరు లేకపోవడం గమనార్హం.
మరి పంచాయితీ రాజ్ శాఖ అధికారులు ఏఎంసీ చైర్మన్ పేరు ను మరిచిపోయారా?లేక కావాలనే పేరు ను తప్పించారా?
ఏది ఏమైనప్పటికీ శిలా ఫలకం పై ఏఎంసీ చైర్మన్ పేరు లేకపోవడం ఆమెను ఘోరంగా అవమానించినట్లేనని సచివాలయాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన పలువురు వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు.
మరి సంబంధిత పంచాయతీరాజ్ శాఖ అధికారులు రానున్న రోజుల్లో ఇదే పరిస్థితిని కొనసాగిస్తారా? ప్రోటోకాల్ ని పాటిస్తారా? లేదా వేచిచూడాలి.