Breaking News

అల్లూరి జిల్లా: రంగిలిసింగిలో అంబేద్కర్ చిత్రపటం ఆవిష్కరణ.

0 19

 అల్లూరి జిల్లా: రంగిలిసింగిలో అంబేద్కర్ చిత్రపటం ఆవిష్కరణ.


దళితులు మహిళలు కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అరకు నియోజవర్గ వైకాపా సీనియర్ నేతలు సమర్డి.భాస్కరరావు, పాంగి.చిన్నారావు, పల్టాసింగి.విజయ్ కుమార్, పట్టాసి.కొండలరావు అన్నారు.ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా.రవిబాబు ఆదేశాల మేరకు గురువారం డుంబ్రిగుడ మండలంలోని రంగలిసింగి గ్రామంలో వారు అంబేద్కర్ చిత్రపటాలను ఆవిష్కరించి యువకులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..అంబేద్కర్ దళిత బహుజన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మహా మేధవి అంబేద్కర్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పరశురాం, బి.కె.నాయుడు, మండల సర్పంచ్ ల   ఫోరం అధ్యక్షుడు హరి సుందర్ రావు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.