అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: రత్నంపేట పంచాయితీ గ్రామంలో వైసిపి మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి,సంక్షేమం గురించి మాట్లాడిన ఆయన రానున్న ఎన్నికలలో సిఎం జగన్ మోహన్ రెడ్డి ని మరలా సిఎం గా గెలిపించుకునేందుకు మీరంతా సైనికుల్లా పనిచేసి పాడేరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు ని,అరకు ఎంపీ అభ్యర్థి డా.గుమ్మ తనుజారాణి ని ఫ్యాన్ గుర్తు పై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజారిటీతో గెలుపించాలని కోరారు.