అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర విజయవంతం కావడం వలన ప్రతీ పక్షాలు ఓర్వలేక జగన్ పై దాడికి పాల్పడ్డారని రాజకీయాలలో రాజకీయంగా చూడాలి గాని వ్యక్తిపై భౌతిక దాడి చేసి ముఖ్యమంత్రి జగన్ ని గాయాలపాలు చేయడం సమంజసం కాదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి అంటే పేదవాడి మీద దాడే అని అన్నారు.జగన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్ కోరారు.ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రాజకీయాలు అనే తారతమ్యం చూడకుండా రాష్ట్ర ప్రజలకు సుభిక్షంగా పాలన అందించారు అని,భవిష్యత్తులో మరింత సంక్షేమం, అభివృద్ధి పేద,బడుగు,బలహీన వర్గాలు వారికి మంచి జరగాలి అంటే కచ్ఛితంగా జగన్ వలనే సాధ్యం అని అన్నారు. ఇటువంటి వ్యక్తి యొక్క విజయాన్ని ఆపడం ఎవరితరం కాదు అని అన్నారు.’మేము సిద్ధం’ బస్సు యాత్రకు ప్రజలు రోడ్డు పైకి వచ్చి పూలు,హారతులుతో స్వాగతం పలుకుతూ
బ్రహ్మరథం పడుతుంటే ప్రతిపక్షాలకు మింగుడు పడకపోవడం,యాత్ర జరిగితే 175 స్థానలలో వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది అని ప్రతిపక్షాలు ఎలా అయినా బస్సు యాత్ర అడ్డు కోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ పై దాడి చేయించారని ఎంపీపీ రమేష్ ఆరోపించారు. కానీ మా నాయకుడు జగన్ సింహం.. గాయపడిన సింహం మరింత బలంగా ముందుకు వెలతాడు గాని వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ త్వరగా కోలుకోవాలని ఎంపీపీ రమేష్ కోరారు.