Breaking News

రంజాన్ వేడుకలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు.

0 339

అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు: ఈరోజు పవిత్రమైన రంజాన్ పర్వదినం సందర్భంగా పాడేరు లో రంజాన్ వేడుకల్లో పాడేరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ సహనాన్ని దయా గుణాన్ని సోదర భావాన్ని శాంతి సామరస్యాలను పెంపొందించి మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ పవిత్రమైన పర్వదినం రంజాన్ పండుగని ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలో వైసీపీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు సీదరి రాంబాబు,ఏఎంసీ చైర్మన్ కుతాంగి సూరిబాబు,ఎస్టి సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కూడా సురేష్ కుమార్,ఎంపీటీసీ లకే రామకృష్ణ పాత్రుడు,సర్పంచులు వంతల రాంబాబు,కుర్రబోయిన సన్నిబాబు,టౌన్ ప్రెసిడెంట్ ధన్నెటి పలాసి రాంబాబు,ముస్లిం సోదరులు తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.