అల్లూరి సీతారామరాజు జిల్లా: కొయ్యూరు మండలం లోని ఆడాకుల సచివాలయం పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు గ్రామ వాలంటీర్లు రాజీనామా చేశారు.తాము నాలుగున్నర సంవత్సరాలుగా గ్రామ వాలంటీర్లు గా పనిచేస్తున్నామని, వ్యక్తిగత కారణాల వల్ల అలాగే ఇతర పార్టీల వేధింపులు వల్ల వాలంటీర్ బాధ్యతలు నుండి తొలగిపోతున్నట్లు వారు తెలిపారు.