గ్రామసభ లో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్,డైరెక్టర్.
ఈరోజు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రావణాపల్లి పంచాయితీ కార్యదర్శి రజినీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ,ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్ పాల్గొని ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం స్థానిక పంచాయితీ సర్పంచ్ కాకురు లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఈ ప్రాంతం అంతా షెడ్యూల్డ్ ఏరియా కనుక గిరిజన చట్టాలు సక్రమంగా అమలు జరిపేందుకు పంచాయితీ స్థాయి అధికారులు సహకరించాలని,బినామీ ఎస్టీలు గా చలామణి అవుతున్న వారి సర్టిఫికేట్ లను నిలుపుదల చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్, ఆదివాసీ ప్రజా చైతన్య సంఘం అధ్యక్షుడు పాడి లోవరాజు, అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమ సేవా సంఘం అధ్యక్షురాలు శ్యామల వరలక్ష్మి, వార్డు మెంబర్ లు,పంచాయితీ ప్రజలు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు పాల్గొన్నారు.