Breaking News

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిల్లు రమేష్ నాయుడు కు ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి జంపా వెంకటరమణ సూటి ప్రశ్న.

0 147

*పార్టీ లో పార్టీ కోసం కష్ట పడిన వారిపై చిన్న చూపేందుకు?
*పాడేరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిల్లు రమేష్ నాయుడు కు ఎస్ టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి జంపా వెంకటరమణ సూటి ప్రశ్న.

(అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం): ఏళ్ల తరబడి మండలంలో అనేక సమస్యలపై పోరాడుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ…కొన్ని సార్లు కష్టాలు, అవమానాలను సైతం దిగమింగుతూ.. టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలును కనీసం గుర్తించకుండా వ్యవహరించడం తగదు అని వెంకటరమణ అన్నారు.మండలంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా మీటింగ్ పెట్టేటప్పుడు కనీసం అక్కడ వున్న మండల బాడీ నీ,కేడర్ ఉన్న లీడర్ కైనా కనీసం విలువ ఇవ్వకపోవడం అవగాహన రాహిత్యం అని అనుకోక తప్పదని,కేడర్ ను,లీడర్ ను వదిలి ఎలా గెలుపు సాధ్యమని ప్రశ్నించారు.అందుకే పార్టీలో అనుభవం ఉన్న వారినే అభ్యర్థి గా ప్రకటించాలని అధిష్టానాన్ని కోరుతున్నామని,అధిష్టానం పునరాలోచించకుంటే ఇలాంటి చర్యల వల్ల ఓటమి తప్పదు అని అన్నారు. ప్రస్తుత అభ్యర్థి కి కేడర్ ఎవరో,లీడర్ ఎవరో కూడా తెలియదని,కేవలం బందువులను నమ్ముకుని రాజకీయం చేస్తాం అనుకుంటే కార్యకర్తల జీవితాలు బలి కాక తప్పుదని,ఇప్పటికే చాలా మంది అధిష్టానం నిర్ణయం వల్ల పార్టీ వీడే ఆలోచనలో వున్నారు అని అన్నారు.అధిష్టానం పునరాలోచించకుంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.