అంతాడ లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం.
జగన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం సర్పంచ్ సుర్ల చంద్రరావు ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం అంతాడ పంచాయితీ గ్రామంలో నిర్వహించడం జరిగింది.ప్రతీ గడపకు వెళ్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి సర్పంచ్ వివరించారు.ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ ధర్మరాజు,వార్డు మెంబర్ లక్ష్మణరావు,వాలంటీర్లు నాగమణి,సీత, అలాగే గృహ సారధులు లక్ష్మణరావు, చిన్నారావు,బాలరాజు,లక్ష్మి పాల్గొన్నారు.