నల్లగొండ గ్రామంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం.
పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ఆదేశాల మేరకు గడప గడపకు వెళుతున్న ఏఎంసీ చైర్ పర్సన్.
(అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం): చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం నల్లగొండ పంచాయితీ గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు..మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ మరలా రానున్న రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి ని ఆశీర్వదించి ముఖ్యమంత్రి ని చేయాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్లు,గృహ సారధులు, వాలంటీర్లు పాల్గొన్నారు.