చింతపల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయతీ లోని బయలుకించంగి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ కి చింతపల్లి,జికే వీధి,కొయ్యూరు,జి.మాడుగుల,పాడేరు,హుకుంపేట,అరకు మండలాల వారు మాత్రమే పాల్గొనాలని తెలిపారు. మొదటి బహుమతి 30 వేల రూపాయలు,రెండవ బహుమతి 20వేల రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎంట్రీ ఫీజు 1500 రూపాయలు చెల్లించాలని, రిజిస్ట్రేషన్ డేట్ ఈనెల (మార్చి) 27 నుండి వచ్చేనెల (ఏప్రిల్) మూడవ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు విజయ్ 9493381304, మత్యరాజు 9391885936, బాబి 6303715414, సంతోష్ 9493052318 అను వారి నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు.
Prev Post