Breaking News

రావణాపల్లి లో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం.

0 17

 రావణాపల్లి లో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం.

పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ఆదేశాల మేరకు నేరుగా ప్రజల గడప వద్దకు ఏఎంసీ చైర్ పర్సన్,డైరెక్టర్.

సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని,మళ్ళీ జగనే ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆశీస్సులు. 

(అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం): రావణాపల్లి సచివాలయం పరిధిలోని పాత రావణాపల్లి,రావణాపల్లి గ్రామాల్లో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ వల్ల ముఖ్యంగా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఫించన్ దారులకు నేరుగా ఇంటి వద్దకే వచ్చి ఫించన్ ఇస్తున్నారని, అర్హులైన ప్రతీ లబ్దిదారులకు సంక్షేమ పథకాలు సక్రమంగానే అందుతున్నాయని తెలిపారు. లబ్ధిదారులతో ఏఎంసీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కులం,మతం,పార్టీ,ప్రాంతం అని తేడా లేకుండా అర్హతే కొలమానంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ప్రజలు ఆశీర్వదించి రానున్న 2024 ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిని చేయాలని, ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ని, ఎంపీ గొడ్డేటి మాధవి ని కూడా ఆశీర్వదించాలని ఆమె ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో అంతాడ సర్పంచ్ చంద్రరావు,గృహ సారధులు వాకపల్లి కరుణ్ కుమార్,నడిగట్ల దేముడు,పాడి కృష్ణమూర్తి,సప్పి పూర్ణ,కూడా రాజేష్ అలాగే వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.