అల్లూరి సీతారామరాజు జిల్లా,జీకే వీధి మండలం దుప్పలవాడ,గుమ్మిరేవుల, దారకొండ పంచాయితీల ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే చికిత్స పొందుతారని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి అన్నారు.దారకొండ పిహెచ్ సి లో వైద్య పరీక్షలు నిర్వహించే అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఉపయోగంలో లేవని అంటున్నారని,దారకొండ పిహెచ్ సి లో సిబ్బంది కొరత ఏర్పడిందని మూడు పంచాయితీల నుంచి సుమారు 30 వేలమంది జనాభా కలిగి ఉంటామని చెబుతున్నారని తెలిపారు. అదే విధంగా ఒరిస్సా,రంపచోడవరం నియోజకవర్గం ప్రాంత ప్రజలు కూడా వైద్య సేవలు పొందడానికి ఇదే పిహెచ్ సి కి వస్తారని అన్నారు.అత్యవసర ఆరోగ్య సమస్యలు ఎదురైతే ప్రజలు ప్రాణాలు కోల్పోయినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆవేదన చెందుతున్నారు. కేవలం నాలుగు పడకలేనని, ఒకే ఒక్క ఎల్టీ ఉండడంతో కొన్ని సందర్భాల్లో శెలవు తీసుకుంటే, వైద్య పరీక్షలు జరగదని అన్నారు. ఈ విషయాన్ని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి దృష్టికి సమాచార హక్కు చట్టం సభ్యులు కిల్లో బాబురావు తీసుకొచ్చినట్టు అర్జున్ తెలిపారు.ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో లు స్పందించి, వెంటనే వైద్య సిబ్బందిని నియమించాలని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.