Breaking News

పాడి,రత్నంపేట రహదారి నుండి కృష్ణాదేవిపేట మీదుగా ఇసుక అక్రమ రవాణా.

0 19

 పాడి,రత్నంపేట రహదారి నుండి కృష్ణాదేవిపేట మీదుగా ఇసుక అక్రమ రవాణా.

అతి వేగంతో ఇసుక ట్రాక్టర్ ను తోలుకుంటూ వెళుతున్న 18 నుండి 19 సంవత్సరాల లోపు గల యువకుడు.

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం లోని కొత్తూరు నుండి పాడి,రత్నంపేట రహదారి మీదుగా కృష్ణాదేవిపేట వైపుగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.

రోజూ మూడు నుండి నాలుగు ట్రాక్టర్లు వరకు ఇదే రహదారి మీదుగా వెళుతున్నాయి.

 నాలుగు ట్రాక్టర్లు రోజుకు 15 నుండి 20 సార్లు తిరుగుతున్నట్లు పరిసర ప్రాంత ప్రజలు చెబుతున్నారు.

ట్రాక్టర్ లో ఇసుక 4000 నుండి 5000 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు ప్రాధమిక సమాచారం.

అయితే చిన్న వయసులో అతి వేగంతో ట్రాక్టర్ నడుపుతున్న యువకులు.. ఎదురుగా వస్తున్న వాహనాలను సైడ్ ఇవ్వకుండా మరీ వెళుతున్నారు.

అయితే ఈ ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసేది ఎవరు?

Leave A Reply

Your email address will not be published.