Breaking News

కొయ్యూరు: శ్రీ శ్రీ శ్రీ ఎర్రగొండమ్మ అమ్మవారికి చీర సారె పసుపు కుంకుమ నైవేద్యాలు.

0 184

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం: నడింపాలెం పంచాయితీలో గల నడింపాలెం,శరభన్నపాలెం నడుమ వెలసిన మన్య ప్రజల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ ఎర్రగొండమ్మ తల్లి అమ్మవారికి ఈరోజు చీర సారే పసుపు కుంకుమ నైవేద్యాలు అందించడం జరిగింది. ఈ దైవ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ గొడ్డేటి మహేష్ మాట్లాడుతూ…అనాదిగా అమ్మవారి జాతర ఈ సమయంలో చేయాల్సి ఉన్నా అమ్మవారికి ఎటువంటి మనులు మాణిక్యాలు లేనందువల్ల పూర్తిగా దాతల సహాయంతోనే జాతర నడుపవల్సి వుంటుందని అన్నారు. విరాళ సమయం కాస్త అటు ఇటుగా ఉన్నప్పుడు ఇలా అమ్మవారికి సమయానుకూలంగా మొక్కులు చెల్లించి తదుపరి జాతర నిర్వహించడం ఆనవాయితీ అనాదిగా వస్తున్నదని జాతర నిర్వహించబోయే సమయం,తేదీ లు పూర్వ పెద్దలు, ఇతర కమిటీ సభ్యులుతో చర్చించి త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు జంపా వెంకటరమణ,సుర్ల పవన్,సంపరి త్రిమూర్తులు, ఇతర భక్తులు,నడింపాలెం గ్రామ ప్రజలు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.