అల్లూరి జిల్లా,కొయ్యూరు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ వాలంటీర్లు ఎవరైనా ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నా వెంటనే (క్షణాల్లో) విధుల నుంచి తొలగించడం జరుగుతుందని,ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులు,ఎంసీసీ టీమ్ అప్రమత్తంగా వ్యవహరించకపోతే వారు కూడా ఎన్నికల కమిషన్ తీసుకునే తీవ్రమైన చర్యలకు గురగుదురని కావున మీ పరిధిలోని గ్రామ వాలంటీర్లకు తగు ఆదేశాలు ఇచ్చి వెంటనే వారిని ఎటువంటి పొలిటికల్ ఈవెంట్స్ లో పాల్గొనకుండా చూడాలని ఎంపీడీఓ లాలం సీతయ్య తెలిపారు.