కితలంగి పరిశీల పంచాయతీల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేయాలి: సర్పంచ్ సుబ్బారావు
(అల్లూరి సీతారామరాజు జిల్లా): డుంబ్రిగుడ మండలంలోని మారుమూల పంచాయతీలైన కితలంగి పరిశీలలో సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని కితలంగి సర్పంచ్ ఒరాబోయిన.సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కితలంగి పరిశీల పంచాయితీల్లో దశాబ్దాలుగా సెల్ టవర్ లేక ఆ పంచాయతీల పరిధి గ్రామాల ప్రజలు సచివాలయ సిబ్బంది పడే బాధ వర్ణనతీతం.ప్రస్తుతం సంక్షేమ పథకాలు ఆన్లైన్లో అమలు చేస్తుండడంతో 4జీ సేవలు తప్పనిసరి అన్నారు.మారుమూల గిరిజన గ్రామాలు కావడంతో కొండెక్కితే కానీ సెల్ సిగ్నల్ దొరకని దుస్థితి నెలకొందన్నారు.టవర్లు ఎంపిక చేయడానికి సంబంధిత అధికారులు రూపొందించిన ప్రతిపాదనలపై గిరిజనులు పెదవి విరుస్తున్నారన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి కితలంగి పరిశీల పంచాయితీల్లో సెల్ టవర్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.