Breaking News

పాడేరు అసెంబ్లీ టికెట్ గిడ్డి ఈశ్వరి కి కేటాయించాలని తీర్మానాలు.

0 231

*పాడేరు అసెంబ్లీ టికెట్ గిడ్డి ఈశ్వరికి కేటాయించాలి.
*పాడేరు అసెంబ్లీ ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు తీర్మానాలు.
*టికెట్ విషయమై దీక్షలు చేసే అవకాశం.
అల్లూరి జిల్లా,పాడేరు: పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గా బాధ్యతలు చేపడుతున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కి కేటాయించాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం 5 మండలాల మండల అధ్యక్షులు,క్లస్టర్,యూనిట్,బూత్ కమిటీలు,కుటుంబ సాధికార సారధులు, సీనియర్ నాయకులు,ఎంపీటీసీలు,జడ్పీటీసీలు,ఎంపీపీలు,సర్పంచులు అందరూ ఏ మండలానికి ఆ మండలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తో పాటు తెలుగుదేశం పార్టీ పెద్దలకు తీర్మాన పత్రాలు రాసుకొని సంతకాలు సేకరించారు. తీర్మానం చేసిన పత్రాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపినట్లు పాడేరు,జిమాడుగుల,చింతపల్లి,కొయ్యూరు,జీ కే వీధి మండలాల మండల అధ్యక్షులు తెలియజేశారు.అయితే నేటి నుండి మండల కేంద్రాల్లో దీక్షలు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు వారు తెలిపారు. పాడేరు అసెంబ్లీ టికెట్ గిడ్డి ఈశ్వరికి కేటాయించాలని వారు అధిష్టానాలకు డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.