Breaking News

నూతన కోపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా సుమర్ల సూరిబాబు బాధ్యతలు స్వీకరణ.

0 20

 నూతన కోపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా సుమర్ల సూరిబాబు బాధ్యతలు స్వీకరణ.

పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి కి,కొయ్యూరు మండల వైసీపీ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన సూరిబాబు.

సుమర్ల సూరిబాబు ( పీఎసీఎస్ చైర్మన్)


 వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ మండల అధ్యక్షుడు సుమర్ల సూరిబాబు ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గం లోని కొయ్యూరు మండల నూతన కోపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా సుమర్ల సూరిబాబు, డైరెక్టర్ గా మొట్టడం సన్యాసి దొర బాధ్యతలు స్వీకరించారు.

సుమర్ల సూరిబాబు (పీఎసీఎస్ చైర్మన్), సన్యాసిదొర (డైరెక్టర్)


వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి సుమర్ల సూరిబాబు పార్టీ లో తనదైన శైలిలో ముఖ్య పాత్ర పోషించారు.2014 నుండి 2021 వరకు మండల అధ్యక్షుడు గా బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేశారు. పార్టీ ఆవిర్భావం నుండి వైసీపీలో కొనసాగుతున్నప్పటికీ, పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేయడం తప్ప..ఏనాడు పదవుల గురించి ఆశించిన దాఖలాలు సుమర్ల సూరిబాబు లో కనపడలేదు.అయితే సూరిబాబు పార్టీకి చేసిన సేవలను గుర్తించిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి వైసీపీ పార్టీ సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపిన అనంతరం సుమర్ల సూరిబాబు ని కొయ్యూరు మండల కోపరేటివ్ బ్యాంకు నూతన చైర్మన్ గా నియమించేందుకు నిర్ణయించారు.

పీఎసీఎస్ చైర్మన్ తో వైసీపీ నేతలు 


ఈ మేరకు ఈరోజు కోపరేటివ్ బ్యాంక్ నూతన చైర్మన్ గా సుమర్ల సూరిబాబు బాధ్యతలు స్వీకరించారు. తనకు ఈ పదవి రావడానికి ముఖ్యకారకులైన ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి కి, వైసీపీ సీనియర్ నాయకులు చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ కి, జెడ్పీటీసీ వారా నూకరాజు కి,ఎంపీపీ బడుగు రమేష్ కి, పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు కి, గాడి సత్యనారాయణ కి మరికొంతమంది నాయకులకు సూరిబాబు కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ కోసమే కష్టపడి పని చేస్తూ,పార్టీకి కట్టుబడి ఉన్నందుకు ఈరోజు తగిన గుర్తింపు దక్కిందని సూరిబాబు హర్షం వ్యక్తం చేశారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, వైస్ ఎంపీపీ నూకాలమ్మ,నూతన పీఎసీఎస్ డైరెక్టర్ మొట్టడం సన్యాసి దొర,నర్సి కృష్ణ,కాకరి బాలరాజు,సత్యారావు,దిబ్బా రాజు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.