అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయితీలోని పాత తుమ్మలబంధ గ్రామంలో ఈరోజు ఉదయం 11గంటలకు కర్రి మరిణమ్మ అనే వృద్దురాలి తాటాకు ఇల్లు దురదృష్టవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది.
ఆమె ఉంటున్న తాటాకు ఇల్లు పూర్తిగా కాలి బూడిదవడంతో కన్నీరుగా మున్నీరుగా విలపించింది.సాయం కోసం ఎదురు చూస్తుంది.విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ సెగ్గే సూరిబాబు, వైకాపా నాయకుడు శేఖర్ అక్కడికి చేరుకొని ఆమెను పరామర్శించి ఓదార్చారు. జరిగిన నష్టం గురించి పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని వారు ఆమెకు ధైర్యం చెప్పారు.