Breaking News

ఎర్రగొండమ్మ తల్లి పండుగ సందర్భంగా గుర్రపు పందాలు

0 20

ఎర్రగొండమ్మ తల్లి పండుగ సందర్భంగా గుర్రపు పందాలు

(అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం): ఎర్ర గొండమ్మ తల్లి పండుగ సందర్భంగా మూడవరోజు అరకు ఎంపీ స్వగ్రామమైన శరభన్నపాలెంలో మంగళవారం రాష్ట్ర స్థాయి గుర్రపు పందాలు నిర్వహించారు.

ఉత్సవ కమిటీ చైర్మన్ గొడ్డేటి మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పాల్గొన్నారు.

పరిసర ప్రాంత ప్రజలకు వినోదాన్ని అందించడంలో భాగంగా ఈ గుర్రపు పందాలు నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ మహేష్ తెలిపారు.

ఈ గుర్రపు పందాలకు మొత్తం 18 గుర్రాలు రాగా.. గుర్రపు పందాలలో గెలిచిన వారికి మొదటి బహుమతి 50వేల రూపాయలు, రెండవ బహుమతి 30 వేల రూపాయలు, మూడో బహుమతి 20వేల రూపాయలు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి చేతుల మీదుగా బహుకరణ అందజేశారు.

ఈ గుర్రపు పందాలకు ఎంతగానో సహకరించిన భద్రాచలం పాల్ రాజ్ ఇంజనీరింగ్ కళాశాల వారికి, ఉత్సవ కమిటీ సభ్యులకు ఉత్సవ కమిటీ చైర్మన్ మహేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్, స్థానిక సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ లోకుల సోమాగాంధీ,చింతపల్లి మాజీ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ హలియారాణి, వైసీపీ పార్టీ అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, సురేష్ పట్నాయక్,రేసుకట్ల కొండబాబు,నానాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.