ఆంధ్రప్రదేశ్:’మేం సిద్ధం- మా బూత్ సిద్ధం’వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ~ సీఎం జగన్ స్పీచ్
2024 ఎన్నికలకు సిద్ధమయ్యాం. రాష్ట్రంలో మనం గ్రౌండ్ లెవల్ నుంచి మనం బలంగా ఉన్నాం. రేపటి నుంచి 45 రోజులు మనకు కీలకం.
– బంగారు రుణాలు,రైతు రుణ మాఫీ ఇలా చంద్రబాబు ఇచ్చిన చెత్త ప్రకటనలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి,అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు నేర్పరి.
– కనీసం సాధ్యమవుతుందో లేదో కూడా తెలియకుండానే చంద్రబాబు ఈ వాగ్దానాలన్నీ చేశారు. మనం అలా చేయము. మనం చెప్పేది చేస్తాం! చేసేదే చెప్తాం!
– ఇచ్చిన హామీలు నేరవేర్చకపోగా వారి పార్టీ వెబ్‌సైట్‌లో నుంచి టీడీపీ మేనిఫెస్టోను కూడా తీసేసింది. వారి కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ఏం చెబుతారు?
– కానీ, మేము అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాము. ప్రజలు మాకు నమ్మకంతో ఓట్లు వేశారు. ఇప్పుడు,నా కార్యకర్తలందరూ సగర్వంగా ప్రతి ఇంటిని సందర్శించి,మేం నేరవేర్చిన మెనిఫెస్టో వాగ్దానాలలో ప్రతి ఒక్కటి ఎలా చేసి చూపించామనేదాని గురించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. విపక్షాలు చేసే విషప్రచారం తిప్పి కొట్టండి.
– కుప్పంలో 93.29%తో కలిపి మన ప్రభుత్వం ద్వారా 87% కుటుంబాలు ప్రయోజనం పొందాయి.
– ఈ ఎన్నికల్లో జరిగేది క్యాస్ట్ వార్ కాదు,క్లాస్ వార్.
– మీరందరూ ప్రతి ఇంటికి వెళ్లి జగన్ ఉంటే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పాలి.
– వైఎస్‌ఆర్‌సీపీకి ఓటు వేయకపోతే మన ప్రభుత్వంలో వస్తున్న సంక్షేమం అంతా ఆగిపోతుందని అందరిగి అవగాహన కల్పించాలి.
– మన మేనిఫెస్టో మన భగవద్గీత,ఖూరాన్,బైబిల్. కానీ టీడీపీకి మాత్రం మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసేదానిగానే చూస్తారు. వాళ్లు పేదల గురించి పట్టించుకోరు.
– ఇదంతా నమ్మకానికి సంబంధించింది. జగన్ చేస్తానని చెబితే చేస్తాడు! ఆలోచించి ఆచి తూచిన తర్వాతే జగన్ వాగ్దానాలు చేస్తారు. చంద్రబాబు మాత్రం కాదు.
– మన వ్యవస్థే మనకు అత్యంత ముఖ్యమైనది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలందరు తమ బూత్ సామర్థ్యాన్ని అంచనా వేయాలి. బూత్‌స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్ చేయండి.
– ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోండి. ఒక విశ్వసనీయ వ్యక్తిని నియమించండి. ఈ వ్యక్తి మన కార్యకర్తలను సన్నద్ధం చేయడంతోపాటు వారిని పర్యవేక్షించగలగాలి.
– అయితే మీరందరూ ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉండాలి. అర్ధరాత్రి కాల్స్ వచ్చినా,మీరు వాటికి సమాధానం ఇవ్వాలి. బూత్‌స్థాయిలో ఓటర్లను ఎన్నికలలోపు కనీసం ఐదారుసార్లు కలివండి.
– వాలంటీర్లు,గృహ సారథులతో సమన్వయపరచుకుంటూ వారితో కలిపి ఒక సొంత బృందాన్ని తయారు చేసుకోండి. అందులో ప్రతి బూత్ బృందంలో 15 నుంచి 18 మంది బూత్ సభ్యులు ఉంటారు.
– మా ప్రభుత్వానికి ఘనమైన రికార్డు ఉంది. మనం గొప్పగా పని చేశాం. ఇప్పుడు మన దృష్టి కేవలం మన నూతన వ్యవస్థపై మాత్రమే పెట్టాలి. మనం మంచి చేశామనే తృప్తితో ప్రజల వద్దకు వెళ్లండి.
– మనం అందరికీ మంచి చేసినట్లయితే,పూర్తి మెజారిటీతో ఎందుకు గెలవలేము!. ఆ మెజారిటీ కుప్పం నుంచే ప్రారంభం కావాలి.
– నా స్థాయిలో నేను చేయగలిగినదంతా చేశాను. ఇప్పుడు మీ వంతు! మీరందరూ గెలవాలని నేను కోరుకుంటున్నాను!
– ఇప్పటి వరకు అన్ని అసెంబ్లీ,లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేశాం. దాదాపు ఇవే ఫైనల్, టికెట్ల గురించి మీరు ఆలోంచిక్కర్లేదు. మీరు చేయాల్సిందల్లా లబ్ది పొందిన ప్రతి గడపకు వెళ్లి మనం చేసిన మంచిని ఓట్లుగా మార్చుకోవటమే.
– పూర్తి విశ్వాసంతో ప్రతి ఇంటికి వెళ్లండి. పేదలకు మంచి చేశామని, ఇప్పుడు మీ మద్దతు మాకు అవసరమని చెప్పండి. మన లక్ష్యం 175/175 అని గుర్తుంచుకోండి. ఆల్ ది బెస్ట్ అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు.
Prev Post