Breaking News

కొమ్మికలో ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపు

0 32

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం: కొమ్మిక పంచాయితీ కేంద్రంగా సచివాలయంలో వైద్యాధికారుల ఆధ్వర్యంలో ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు.

ఈ మెడికల్ క్యాంపు కార్యక్రమంలో కొమ్మిక పంచాయితీ గ్రామ ప్రజలు,ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలకు వైద్యాధికారులు సుధాశారద,ప్రసాద్,చందన,భాగ్యలక్ష్మి,ఆర్ వి రమణ లు వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ సురక్ష మెడికల్ క్యాంపు లో బిపి, షుగర్ తదితర బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించామని వైద్యాధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,గ్రామ సర్పంచ్ సెగ్గె సూరిబాబు,సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి,పంచాయితీ సెక్రటరీ ఆర్ పి నాయుడు,సచివాలయ సిబ్బంది,ఏఎన్ఎం లు,సచివాలయ ఏఎన్ఎం అన్ని గ్రామాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.