Breaking News

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో అంతాడ సర్పంచ్ చంద్రరావు.

0 24

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో అంతాడ సర్పంచ్ చంద్రరావు.

తన దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కారానికై ఎంపీ దృష్టికి తీసుకు వెళ్లిన సర్పంచ్.

సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ.


(అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం): ఈనెల 7 నుండి 29 వరకు జగనన్నే మా భవిష్యత్తు..మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా అంతాడ సర్పంచ్ చంద్రరావు.. పంచాయితీ పరిధిలోని ఎద్దుమామిడి,సింగధార,గంపరాయి,డేకురాయి,టెంకలపనుకులు, పారికేలు,గరుడ గ్రామాల్లో పర్యటించడం జరిగింది.

అంతాడ సమస్యలు ఎంపీ దృష్టికి 

ఈ క్రమంలో సర్పంచ్ చంద్రరావు వద్దకు ఆయా గ్రామాల ప్రజలు తీసుకు వచ్చిన సమస్యలు పరిష్కారంలో భాగంగా అక్కడ ఉన్నవారికి సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ప్రసాద్ ద్వారా సుమారుగా 200 మందికి మూడు రోజుల పాటు ఆధార్ నమోదు,అప్డేషన్, రేషన్ కార్డు యాడింగ్ చేయించడం జరిగింది.అలాగే గత 60 సంవత్సరాలుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా లేని టెంకలపనుకు గ్రామస్తురాలైన పాతుని శాంతమ్మ అనే వృద్ధురాలికి ఆధార్ కార్డు,రేషన్ కార్డు కూడా వెంటనే చేయించడం జరిగింది.

వృద్ధురాలికి ఆధార్,రేషన్ కార్డు చేయించిన  సర్పంచ్ 

ఘాటీ పైనున్న గ్రామస్తులకు సంబంధించి ఆయా గ్రామాల ప్రజలు త్రాగునీరు,రహదారి సదుపాయం కల్పించాలని సర్పంచ్ ని కోరడం జరిగింది.సమస్యలు తెలుసుకున్న సర్పంచ్ ఎంపీ గొడ్డేటి మాధవి ని కలిసి సమస్యలు వివరించడం జరిగింది.సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ చంద్రరావు తెలిపారు.సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారని సర్పంచ్ చంద్రరావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.