*కొయ్యూరు మండలంలో ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ (ఐఏఎస్),పీఓ,డీడీ పర్యటన.
*డౌనూరు బాలుర ఆశ్రమ పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడు సస్పెండ్.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని డౌనూరు బాలుర ఆశ్రమ పాఠశాలను ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ జె.వెంకట మురళీ (ఐఏఎస్),ప్రోజెక్ట్ అధికారి అభిషేక్,డీడీ కొండలరావు సందర్శించారు.పాఠశాలలో విద్యార్థుల చదువు,వారికి పెట్టే మెనూ పరిశీలించారు.ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తున్న తీరును పరిశీలించి 10వ తరగతి విద్యార్థులకు హిందీ,సోషల్ సబ్జెక్ట్ లు చదివించి,వ్రాయించగా సోషల్ సబ్జెక్ట్ లో ప్రశ్నలకు విద్యార్థులు సరిగా సమాధానం చెప్పకపోవడంతో అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసి సోషల్ టీచర్ దేసగిరి రాజుబాబు ను సస్పెండ్ చేశారు.వీరితో పాటు కొయ్యూరు ఏటిడబ్ల్యూఓ క్రాంతికుమార్ పాల్గొన్నారు.