Breaking News

కొయ్యూరు: ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సీఐ,ఎస్ఐ.

0 189

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: కొయ్యూరు సిఐ వెంకటరమణ,మంప ఎస్ఐ లోకేష్ కుమార్ వారి సిబ్బందితో పాటు శుక్రవారం బూధరాళ్ల పంచాయతీలో గల మారుమూల అన్నవరం,గొర్లిమెట్ట, కన్నవరం గ్రామాలను సందర్శించి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది.అలాగే గరిమండ,కన్నవరం, కునుకూరు పోలింగ్ కేంద్రం సందర్శించి అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ఎవరూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన రాదని అందరూ కూడా రానున్న ఎలక్షన్స్ నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని అన్నారు. అలాగే వారి యొక్క సమస్యలను సంబంధిత అధికారులకు తెలియపరచి పరిష్కారం అయ్యే విధంగా చేస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.