Breaking News

అనధికారికంగా విద్యుత్ ను వాడుకున్న కొయ్యూరు పీఎసీఎస్ బ్యాంకు సెక్రటరీ.

0 46

 సంవత్సర కాలం నుండి అనధికారికంగా విద్యుత్ ను వాడుకున్న పీఎసీఎస్ సెక్రటరీ.

కరెంట్ కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ శాఖ అధికారులు.

అనధికారిక విద్యుత్ వాడకం వల్ల వచ్చిన కరెంట్ బిల్లు 11 వేల 70 రూపాయలు.

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలంలో ఉన్న పీఎసీఎస్ బ్యాంకు వద్ద పనిచేస్తున్న సెక్రటరీ కర్రి సత్యనారాయణ సంవత్సర కాలం నుండి బిల్లు కట్టకుండా అనధికారికంగా విద్యుత్ ను వాడుకున్నారు.దీంతో విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు సుమారుగా పదిహేను రోజుల క్రితం పీఎసీఎస్ బ్యాంకు వద్దకు చేరుకుని కరెంట్ రాకుండా వైర్ కట్ చేసి నిలుపుదల చేయడం జరిగింది.అనధికారికంగా వాడటం వల్ల వచ్చిన బిల్లు 11 వేల 70 రూపాయలు కట్టాలని ఈరోజు విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది.అయితే బాధ్యతగల అధికారిగా విధులు నిర్వర్తించాల్సిన సెక్రటరీ సత్యనారాయణ కరెంట్ ను ఇలా అడ్డదారిలో వాడటం ఏంటని పలువురు రైతులు అంటున్నారు.

అయితే సెక్రటరీ సత్యనారాయణ చేసింది ఇది మాత్రమే కాదు పీఎసీఎస్ బ్యాంకు వద్ద అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం గిరిజనులకు ఇవ్వకుండా.. ఇంతకు ముందు పీఎసీఎస్ చైర్మన్ గా ఉన్న అప్పన గజ్జయ్యదొర ద్వారా మేనేజ్ చేసి తన తనయుడైన కర్రి మణికంఠ కి కంప్యూటర్ ఆపరేటర్ గా నియమించి నెలకు 9 వేల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది.తండ్రీ,కొడుకుల కనుసన్నల్లోనే కొయ్యూరు కోపరేటివ్ బ్యాంకు నడుస్తుందని వినికిడి. దీనికి చరమగీతం పాడి సెక్రటరీ తనయుడు మణికంఠ ను తొలగించి అవుట్ సోర్సింగ్ ద్వారా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొయ్యూరు మండలానికి చెందిన గిరిజనుడికి ఇవ్వాలని పలువురు రైతులు,గిరిజనులు విమర్శిస్తున్నారు.మరి నూతన కోపరేటివ్ బ్యాంకు చైర్మన్ సుమర్ల సూరిబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.