Breaking News

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా బిజెపి ప్రజాపోరు యాత్ర లో బిజెపి పాడేరు అసెంబ్లీ కన్వీనర్ కూడా కృష్ణారావు.

0 101

అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గం: ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదేశాలు మేరకు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూధరాళ్ళ పంచాయితీలో ప్రజాపోరు యాత్ర నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల గురించి,సంవత్సరానికి జాబ్ కేలండర్ అన్నావు జాబ్ కేలండర్ లేదు కానీ వున్న ఉద్యోగాలను తీసేసావు,మధ్యపాన నిషేధం అన్నావు ఊరికో మద్యం దుకాణం పెట్టావు,కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను నీ స్టిక్కర్ పెట్టుకొని గొప్పలు చెప్పుకున్నావు,కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీల అభివృద్ధికి 14,15 ఆర్ధిక సంఘం నిధులను సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నావు,రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నీకు రాష్ట్ర ప్రజలు తప్పక తగిన గుణపాఠం చెపుతారు అని కృష్ణారావు అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రీమలి చందర్ రావు, మండల అధ్యక్షులు మురుకుర్తి అప్పలరాజు,జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు అరిమెల రాజు,బిజెపి పాడేరు అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ పండ ఈశ్వరరావు,జిల్లా యువ మోర్చా కార్యదర్శి పొటుకూరి శ్రీను,మండల ప్రధాన కార్యదర్శి కొర్రా త్రినాధ్,ఉపాధ్యక్షులు కూడా కర్రయ్య,సరభయ్య,ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు గాలి దేముడు, మండల కార్యదర్శులు బొంకు రాము,లగిజ రాంబాబు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.