Breaking News

జీకే వీధి: మత్స్యరాస విశ్వేశ్వరరాజు గెలుపుకై శ్రీ శ్రీ బోడేశ్వరస్వామిని దర్శించుకున్న వైస్ ఎంపీపీ సప్పగడ్డ ఆనందరావు

0 114

అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గం: 2024 ఎన్నికల్లో వైసిపి కి 175 కు 175 స్థానాలు గెలవాలని అలాగే పాడేరు ఎమ్మెల్యేగా మత్స్యరాస విశ్వేశ్వరరాజు భారీ మెజారిటీతో గెలుపొందాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలోని పెదవలస లో వేంచేసి ఉన్న శ్రీశ్రీ బోడేశ్వర స్వామిని జీకే వీధి వైస్ ఎంపీపీ సప్పగడ్డ ఆనందరావు కోరుకున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాడేరు నియోజకవర్గానికి సంబంధించి సరైన గెలుపు గుర్రానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించారని కొనియాడారు.రానున్న ఎన్నికల్లో మత్స్యరాస విశ్వేశ్వరరాజు గెలవడంతో పాటు అత్యధిక మెజారిటీ రావడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ రాము,సీనియర్ నాయకులు శ్రీరాములు,అంజి స్వామివారిని దర్శించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.