Breaking News

అక్రమ చేపల చెరువుల యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాలి: సిపిఎం.

0 39

*ఉపముఖ్యమంత్రి బూడిముత్యాలునాయుడు సోంతమండలోనే దారుణం.
*అక్రమ చేపలు చెరువుల యజమానులు బరితెగింపు.
*చేపలు పెంపకం దార్లుపై క్రిమినల్ కేసులు పెట్టాలి : సిపిఎం.
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి: మండలంలోనే దారుణమైన పరిస్థితులు నెలకున్నాయని అక్రమ చేపలు పెంపకందార్లు బరి తెగింపుకు పూనుకుంటున్నారని వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న,మండల కార్యదర్శి బిటి దొర డిమాండ్ చేసారు. బుధవారం దేవరాపల్లి మండలంలోని కొత్త పెంట కలిగోట్ల ములకాలాపల్లి పెదనందిపల్లి తారువా గ్రామాల్లో అక్రమంగా చేపడుతున్న చేపలు చెరువులను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు.దేవరాపల్లి మండలంలో దాదాపుగా వెయ్యి ఎకారాల్లో అక్రమ చేపలు చెరువులు తవ్వకాలు చేపట్టారని, ఏ ఒక్క చెరువుకు అనుమతులు లేవన్నారు.ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు అక్కడ ప్రజలు, రైతులు ఇటువంటి పెంపకాలను వ్యతిరేకించడంతో ఇక్కడ రైతులకు డబ్బులు అశ చూపించి భూములు లీజులకు తీసుకోని అక్రమంగా చేపలు చెరువులు తవ్వకాలు చేపట్టారని తెలిపారు. లాభాలు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతూ,వీటి పెంపకం కోసం పసుమాంసం, కోళ్ళ వ్యర్థాలు, చనిపోయిన గొర్రెలు, మేకలను బ్రాండిక్స్ ఇతర కంపెనీల క్యాంటీన్ లో వ్యర్థాలను చేపలకు వేసి పెంపకం చేపడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.వీటిని తిన్న ప్రజలు ఆనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు.ఈప్రాంతంలో రైవాడ ప్రాజెక్టు ఉండంతో నీళ్ళను చేపలు చెరువులకు వాడుకుంటూ వృదా నీటిని క్రింది పొలాలకు వదిలి పెట్టడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.గతంలో వీటిపై రెవెన్యూ,పోలీసు,ఫిషరింగ్ ఇరిగేషన్ అధికారుల నిఘా ఉండేదని ఉపముఖ్యమంత్రి సొంతమండలం అవ్వడంతో అధికారులు భయపడి పూర్తిగా వదిలి పెట్టేసారని తెలిపారు.దీంతో చేపలు పెంపకం దార్లు పూర్తిగా బరి తెగింపుకు పూనుకొని విచ్చలవిడిగా కోళ్ళు, పసుమాంసం వ్యర్థాలను చేపలు చెరువుల్లో గ్రైయిండింగ్ మిషన్లు పెట్టి గ్రైయిండింగ్ చేసి చేపలకు వేస్తున్నారని తెలిపారు. గతంలో పోలీసులు, విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి గ్రైయిండింగ్ మిషన్లు, బెల్టులు తీసుకు వచ్చే యడం వ్యర్ద పదార్దలును తరలించిన వాహనాలను పట్టుకొని కేసులు నమోదు చేసే వారని తెలిపారు.ప్రస్తుతం ప్రజల ప్రణాలతో లెక్క లేదని తెలిపారు. ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితులు జిల్లాలోని మరెక్కడా లేవన్నారు. అక్రమ సంపాదనలకు అశపడి అధికార పార్టీ నాయకులు చేపల చెరువుల యజమానులకు కొమ్ము కాస్తున్నారని తెలిపారు. వెంటనే చేపలు చెరువులపై ఉన్న గ్రైయిండింగ్ మిషన్లు వెంటనే తొలగించాలని, అనుమతులు లేని చేపలు చెరువుల పెంపకం దార్లు పై క్రిమినల్ కేసులు పెట్టి వ్యర్ధపదార్ధాల నివారణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.