Breaking News

చింతపల్లి: చిన్నయ్య పాలెం గ్రామంలో టీడీపీ పార్టీ విడిచి వైసిపి లో చేరికలు.

0 28

*చిన్నయ్య పాలెం గ్రామంలో టీడీపీ పార్టీ విడిచి వైసిపి లో చేరికలు.
*పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు సమక్షంలో పార్టీలో చేరిన చిన్నయ్య పాలెం గ్రామస్తులు.

అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గం: పాడేరు నియోజకవర్గంలో విశ్వేశ్వరరాజు కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించడం పట్ల నియోజకవర్గం ప్రజలు మద్దతు తెలుపుతూ పలు పార్టీల నుండి సంపూర్ణంగా పార్టీలో చేరుతున్నారు.చింతపల్లి మండలం లోని అంజలి శనివారం,కిటుముల పంచాయితీలో పకాబు,జాజులపాలెం,సింగవరం,చిన్నయ్యపాలెం,అంజలి శనివారం,బూసులకోట,భీముడుసట్టు గ్రామాల్లో విశ్వేశ్వరరాజు పర్యటించారు.

ఆ పరిసర గ్రామాల్లో నీరాజనాలు హారతులతో ఘనంగా స్వాగతం పలికారు.కిముడు పెద్ద సత్యనారాయణ, లకే రామచంద్రరావు,ఎల్.రాజారావు,వనుము చిన్నబాబు,కిముడు భీంబాబు,వనుము వెంకటేశ్వర్లు,కిముడు రత్నకుమారి,కె.కృష్ణకుమారి వారితో పాటు 26 కుటుంబాలు విశ్వేశ్వరరాజు కండువా కప్పి ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ..
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వల్ల ప్రతి గడపకు మేలు జరుగుతుంది కాబట్టి సంక్షేమానికి,పథకాలకు ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి టీడీపీ,బీజేపీ,జనసేన పార్టీల నుండి అధిక సంఖ్యలో చేరుతున్నారని అన్నారు.తనను నమ్మి తన సమక్షంలో ఇతర పార్టీల నుండి వైసీపీ లోకి వస్తున్న ప్రతీ ఒక్కరికీ విశ్వేశ్వరరాజు ధన్యవాదాలు తెలిపారు.మీ నమ్మకాన్ని వమ్ము చేయనని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సాయశక్తుల కృషి చేస్తానని ఆయన అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోతురాజు బాలయ్య,వైస్ ఎంపీపీ సాగిన వెంగళరావు,ట్రైకార్ డైరెక్టర్ సుర్ల లోవరాజు,ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కూడా సురేష్ కుమార్,మాజీ వైస్ ఎంపీపీ బూసరి కృష్ణారావు,చింతపల్లి మండల ప్రచార కమిటీ అధ్యక్షులు కె.రాంబాబు,సర్పంచులు
వనుము రమణమ్మ,కొర్రా రఘునాథ్,లోతా పండయ్య,మాజీ సర్పంచులు
కిముడు బెన్నలింగం,రామస్వామి,సీనియర్ నాయకులు నూకరాజు, సాగిన గంగన్న పడాల్,కవెర్ల రామారావు,లకే కళ్యాణ్,వనుము పోతురాజు,కొర్రా బాలరాజు,డాక్టర్.చంటిబాబు నాయుడు,లమ్మసింగి లోవరాజు,వార్డు మెంబర్లు,నాయకులు,సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు,కార్యకర్తలు,మహిళలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.