అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ఈనెల 19వ తేదీన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీడీఓ కార్యాలయంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో లాలం సీతయ్య తెలిపారు.కొయ్యూరు మండలంలో మొత్తం 312 మంది గ్రామవాలంటీర్లలో ఇద్దరికి సేవా వజ్ర,ఐదుగురికి సేవా రత్న,మిగిలిన 305 మందికీ సేవా మిత్ర అవార్డులు రావడం జరిగిందని ఆయన అన్నారు.వీరిలో సేవా వజ్రా 45000,సేవారత్న 30000,సేవా మిత్రా లకు 15000 నగదును అందజేయడం జరుగుతుందని అన్నారు.కావున ఎంపీటీసీ సభ్యులు,గ్రామ సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకావాలని ఆయన కోరారు.