Breaking News

కొత్తపల్లి గీత నకిలీ గిరిజనురాలు.. నిజమైన గిరిజనులకు సీట్లు కేటాయించండి -టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.

0 48

*కొత్తపల్లి గీత నకిలీ గిరిజనురాలు.
*నిజమైన గిరిజనులకు సీట్లు కేటాయించండి.
*ఒకే కుటుంబంలో పుట్టిన వాళ్లు ఒకరు ఎస్టీ మరొకరు ఎస్సీ ఎలా అవుతారు.
*అసలైన గిరిజనులకు అన్యాయం చెయ్యొద్దు.
*బిజెపి పెద్దలకు లేఖలు రాస్తా.
*పాడేరు అసెంబ్లీ తెదేపా ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు.
అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం:బీజేపీ మహిళా నేత,మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ గిరిజనురాలు కాదని పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు.గురువారం పాడేరు మండలం కుమ్మరిపుట్టు లో ఆమె నివాస గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీజేపీ మహిళా నేత కొత్తపల్లి గీత ఇప్పుడు బీజేపీ తరపున అరకు పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీకి దిగుతామని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.దీనిని తామంతా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. బీజేపీ ఈ విషయంపై ఆలోచన చేయాలని సూచించారు.నకిలీ ఎస్టీలకు సీట్లు కేటాయిస్తే నిజమైన గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు.బీజేపీలో ఎంతోమంది గిరిజనులు ఉన్నారని పేర్కొన్నారు. నిజమైన గిరిజనులకు కాకుండా నకిలీ గిరిజనులకు సీట్లు కేటాయించి, నిజమైన గిరిజనులకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. ఈ విషయంపై బిజెపి పెద్దలు పురందేశ్వరికి లేఖ రాస్తామని ఆమె పేర్కొన్నారు. ఒకే కుటుంబంలో ఒకరు ఎస్టీ మరొకరు ఎస్సీ ఎలా అవుతారని అన్నారు.ఈ విషయాన్ని గిరిజన మేధావులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.