Breaking News

రూ. 4,178 కోట్లతో ఏర్పాటయ్యే పరిశ్రమలకు వర్చువల్ గా శంఖుస్థాపన చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్.

0 31

*రూ. 4,178 కోట్లతో ఏర్పాటయ్యే పరిశ్రమలకు వర్చువల్ గా శంఖుస్థాపన చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్.
*ఎపి ఎంఎస్ఎంఇ ఒన్ వెబ్ సైట్, ర్యాంప్(Raising &Accelerating MSME Productvity)ప్రారంభం.
*ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ లో మూడేళ్లుగా దేశంలో ఎపి మొదటి స్థానంలో ఉంది.
•ఈప్రభుత్వం వచ్చాక సుమారు రూ.20వేల కోట్లతో 4నూతన ఓడరేవులు నిర్మిస్తున్నాం.
•ఈ నాలుగున్నర ఏళ్ళలో 2.5 లక్షల ఎంఎస్ఎంఇ యూనిట్లను రాష్ట్రంలో నెలకొల్పాం.. పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అన్నిరకాలుగా పూర్తి స్థాయిలో సహాయ సహాకారాలను అందిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖా మంత్రి గుడివాడ అమర్నాధ్ స్పష్టం చేశారు.సుమారు 4వేల 178 కోట్ల రూ.లతో ఏర్పాటు చేస్తున్నబిర్లా గ్రూప్,రిలయెన్స్‌ ఎనర్జీ, హెల్లా ఇన్‌ఫ్రా,వెసువియస్‌ ఇండియా లిమిటెడ్,ఏపీఐఐసీ,ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ లకు సంబంధించిన మొత్తం 8 ప్రాజెక్టులను బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వర్చువల్‌గా శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే ఎపి ఎంఎస్ఎంఇ ఒన్ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్ సైట్ ను కూడా మంత్రి లాంచనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం అన్ని విధాలా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందిస్తుందని పునరుద్హాటించారు.గత మూడేళ్ళుగా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎపి మొదటి స్థానంలో నిలించిందని అన్నారు. దేశవ్యాప్తంగా 11 పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేస్తుండగా ఎపి పరిధిలో విశాఖపట్నం-చెన్నె, చెన్నె-బెంగుళూరు, బెంగుళూరు-హైదరాబాదు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతున్నాయని మంత్రి అమర్నాధ్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరాన్ని కలిగి ఉందని తీర ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనుకూలమని పేర్కొంటూ ఈప్రభుత్వం వచ్చాక సుమారు 20 వేల కోట్ల రూ.లతో నాలుగు ప్రధాన పోర్టులను నిర్మిస్తుండగా రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవానికి సిధ్ధంగా ఉందని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాధ్ చెప్పారు. అంతేగాక 10 ఫిషింగ్ హార్బర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈప్రభుత్వం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేందుకు ఎంఎస్ఎంఇల ప్రోత్సాహకానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని స్ఫష్టం చేశారు.దీనిలో భాగంగానే గత నాలుగేళ్ళ కాలంలో 2లక్షల 50 ఎంఎస్ఎంఇ యూనిట్లను రాష్ట్రంలో నెలకొల్పడం జరిగిందని అన్నారు.యువతకు స్థానికంగా మరిన్నిఉఫాది అవకాశాలను కల్పించేందుకు 26 జిల్లాల్లో 50కి పైగా పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోందని వాటికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్లు సిద్ధమయ్యాయని మంత్రి అమర్నాధ్ స్పష్టం చేశారు.
అంతకు ముందు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ మాట్లాడుతూ గ్లోబల్ ఇన్వెస్టుమెంట్ సమ్మిట్ లో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రక్రియలో భాగంగా పరిశ్రమలు వాణిజ్య శాఖకు సంబంధించి 4వేల 178 కోట్లతో ఏర్పాటవుతున్న8 కెంపెనీలను వర్చువల్ గా శంఖుస్థాపన,ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు.వాటిలో తిరుపతి జిల్లా నాయుడుపేటలో బిర్లా కార్బన్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1700 కోట్ల రూ.లతో 250 మందికి ఉపాధి కల్పించే కార్బన్ బ్లాక్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ శంఖుస్థాపన జరుగుతోందన్నారు. అలాగే తిరుపతి జిల్లాలో హెల్లా ఇన్ఫ్రా మార్కెటింగ్ ప్రవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 260 కోట్లతో 400 మందికి ఉపాధి కల్పించే పివిసి పైపులు మరియు పిట్టింగ్స యూనిట్,రిలయెన్స్ ఎనర్జీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో 1024 కోట్లతో 576 మందికి ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నకంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు,అనకాపల్లి జిల్లా పరవాడలో వెసువియస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 250 కోట్లతో 500 మందికి ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నయూనిట్ కు శంఖుస్థాపన చేస్తున్నట్టు చెప్పారు.అదే విధంగా ఎపిఐఐసి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి స్టార్టఫ్ ఏరియాలో 423 కోట్ల రూ.ల తోను,అనకాపల్లి జిల్లా నక్కపల్లి స్టార్టఫ్ ఏరియాలో 395 కోట్లతో యూనిట్లు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు.ఎన్టిఆర్ జిల్లా జగ్గయ్య పేటలో ఎపి ఎంఎస్ఎంఇ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 8కోట్ల రూ.లతో ఏర్పాటు చేసిన గోల్టు క్లస్టర్ కామన్ ఫెసిలిటీ కేంద్రాన్నిమంత్రి వర్యుల చేతుల మీదగా లాంచనంగా ప్రారంభించుకోవడం జరుగుతోందన్నారు.అలాగే కేంద్ర ప్రభుత్వం మరియు ఎపి ఎంఎస్ఎంఇ సంయుక్త భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 118 కోట్ల రూ.లతో నిర్వహించనున్న ర్యాంపు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతోందన్నారు.
అనంతరం ఎపి ఎంఎస్ఎంఇ ఒన్ పేరిట రూపొందించిన వెబ్ సైట్ ను,ర్యాంప్((Raising & Accelerating MSME Productvity) మంత్రి అమర్నాథ్ లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపిఐఐసి ఎండి ప్రవీణ్ కుమార్,పరిశ్రమల శాఖ కమీషనర్ సిహెచ్. రాజేశ్వర్ రెడ్డి,సిఇఓ ఎపి ఎంఎస్ఎంఇ డెవలప్మెంట్ కార్పొరేషన్ సేధు మాధవన్, ఆదిత్యా బిర్లా గ్రూపు సంస్థ ఎపి తెలంగాణా హెడ్ రాచిట్(Rachit)రిలయెన్స్ బయో ఎనర్జీ కి చెందిన వివేక్ తనేజ,హెల్లా ఇన్ప్రా మార్కెటింగ్ సంస్థకు చెందిన సౌత్ ఇండియా హెడ్ కెఆర్ రఘునాధ్, వెసువియస్ ఇండియా లిమిటెడ్ కు చెందిన రోహిత్ బహెటి(Rohit Baheti), జగ్గయ్యపేట గోల్డు క్లస్టర్ ఎండి రామకృష్ణ, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. వర్చువల్ గా ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం ఆయా కంపెనీల ప్రతినిధులను పరిశ్రమల శాఖమంత్రి గుడివాడ అమర్నాథ్ సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.