Breaking News

రహదారి సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ దడాల రమేష్.

0 113

ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం యు చీడిపాలెం పంచాయతీలో గల దాదాపుగా పది గ్రామాలకు సంబంధించి మూడు గ్రావెల్ రోడ్లు ప్రారంభించడం జరిగింది.
ఇందులో భాగంగా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో రెండు నెలల క్రితం తమ పంచాయితీ ప్రజలతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ని కలిసి రహదారి సమస్యలను తెలియజేయడం జరిగిందని,తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ ఆ గ్రామాలకు రహదారి అవసరం చాలా అవసరం అని గమనించి వెంటనే రోడ్లు మంజూరు చేయడం జరిగిందని,ఈరోజు రోడ్డు ప్రారంభంలో భాగంగా మొదటగా పలకజీడి నుండి గంగవరం,నీలవరం,పాలముద్రం వరకు ఏడు కిలోమీటర్లు వరకు అలాగే పలకజీడి నుండి బంగారుబంద,సంఘంవలస,నక్కలమెట్ట మీదుగా రేవులకోట వరకు నాలుగున్నర కిలోమీటర్లు రహదారి అలాగే జంగాలతోట గ్రామం నుండి వేమనపాలెం,పెదలంక మీదుగా ఎర్రగొండ,వరకు నాలుగున్నర కిలోమీటర్లు రహదారి ని స్థానిక సర్పంచ్ దడాల రమేష్ ఆధ్వర్యంలో స్థానిక వైస్ ప్రెసిడెంట్,వార్డు మెంబర్లు, గ్రామ పెద్దల చేతుల మీదుగా పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి రహదారి పనులు ప్రారంభించడం జరిగింది.ఇవే కాకుండా యూ.చీడిపాలెం నుండి ఎర్రగొండ వరకు 11కిలో మీటర్లు మేర 40లక్షల రూపాయలతో కూడిన మెటల్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని సర్పంచ్ తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి,కొయ్యూరు ఎంపీపీ,మండల పార్టీ అధ్యక్షులు స్వయంగా కలెక్టర్ వద్దకు తమను తీసుకువెళ్లి తమ పంచాయతీ సమస్యలను వివరంగా తెలియజేసి తమ గ్రామాలకు రోడ్లు,బ్రిడ్జిలు,మంచినీరు మంజూరు చేయించినందుకు గాను ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి కి, కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్ కి,మండల పార్టీ అధ్యక్షులు జల్లి బాబులు కి ధన్యవాదాలు తెలియజేస్తున్నామనీ అన్నారు.అలాగే తమ సమస్యలను విన్నవెంటనే తక్షణమే స్పందించి తమకు రోడ్లు మంజూరు చేసినటువంటి అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కి,రహదారి కోసం అటవీశాఖ అనుమతులు ఇచ్చిన డీఎఫ్ఓ సూర్యనారాయణ కి,రేంజర్ వర్మ కి తమ పంచాయతీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామనీ సర్పంచ్ దడాల రమేష్ అన్నారు.అలాగే స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. ఈ రోడ్లు,బిడ్జ్ లు,మంచినీరు మంజూరు చేయించడంలో ముఖ్యపాత్ర పోషించిన సర్పంచ్ రమేష్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, ప్రస్తుత సర్పంచ్,వైస్ సర్పంచ్,వార్డ్ మెంబెర్స్ ఎన్నికైన తర్వాతనే మా పంచాయితీలో అభివృద్ధి మొదలైందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.