బరిసింగి పంచాయితీలో పలు గ్రామాల్లో పర్యటించిన పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు.
అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు మండలం: బరిసింగి పంచాయితీ లోని పలు గ్రామాల్లో పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు పర్యటించారు. గడ్డివలస గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ పాంగి సత్తిబాబు,సీపీఐ పార్టీ మాజీ ఎంపీటీసీ బోయిని సింహాద్రి విశ్వేశ్వరరాజు ను గడ్డివలస గ్రామానికి ఆహ్వానించి అయిన సమక్షంలో పార్టీలో చేరారు.వారితో పాటు 15 కుటుంబాలకు పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు,అలాగే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి పలు పార్టీల నాయకులు వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నారని అన్నారు.ప్రజలకు మేలు చేయాలంటే అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కుతంగి సూరిబాబు,డోకులూరు సర్పంచ్ కుర్రబోయిన సన్నిబాబు, బర్సింగి సర్పంచ్ బోయిన చిట్టిబాబు,కుజ్జెలి సర్పంచ్ గబ్బాడి చిట్టిబాబు, కించూరు సర్పంచ్ వంతల రాంబాబు,ఎంపీటీసీ నరసింహమూర్తి, కుర్రబోయిన సింహాచలం,వార్డు సభ్యులు రాధాకృష్ణ,గృహ సారధులు కూడా సోమన్న,బోయిన జ్యోతి,కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.