జీపు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించిన పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వర రాజు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం: చింతపల్లి మండలం లోని కుడుముసారి పంచాయతీ గ్రామాల సరిహద్దులో నిన్న సోమవారం ప్రయాణికులతో వెళుతున్న జీపు బోల్తా పడి ఎగువ మెరికల గ్రామానికి చెందిన అప్పారావు,దిగువ మెరికలు గ్రామానికి చెందిన జర్తా చిన్నమ్మి ఇద్దరు మరణించారు.
జరిగిన విషయం తెలుసుకున్న పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు హుటాహుటిన చింతపల్లి హాస్పిటల్ కి చేరుకుని మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దహన కార్యక్రమం నిమిత్తం వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు.
ఈ సంఘటనలో గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను విశ్వేశ్వరరాజు హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు.విశ్వేశ్వరరాజు వైద్యులతో మాట్లాడుతూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూష దేవి,జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య,మాజీ ఎంపీపీ వంతల బాబురావు,జీ.కే వీధి మండల పార్టీ అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్,మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, జి మాడుగుల మండల పార్టీ అధ్యక్షులు నుర్మానీ మత్యకొండం నాయుడు, వైస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, కుడుము సారి సర్పంచ్ బొండా సింహాచలం,మాజీ వైస్ ఎంపీపీ బూసరి కృష్ణ,బలపం సర్పంచ్ కొర్రా రమేష్ నాయుడు,కించూరి సర్పంచ్ వంతల రాంబాబు,నాయకులు డా జి.పి చంటి బాబు నాయుడు,క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు వంతల కృష్ణారావు,ఐనాడ సర్పంచ్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.