Breaking News

ఎన్నడూ చూడని సంస్కరణలు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో అమలు?- కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు

0 142

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ అశోక్ లాల్,బి వెంకటరావు విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో డిజిటలీకరణ,విద్యార్దులుకు పౌష్టికాహారం ఇవి సంస్కరణలు అంటూ గొప్పగా డబ్బా కొడుతున్నారని అన్నారు. ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో అవి అందుతున్నాయా లేదో అని ఏరోజు అయిన ఈ ఐదు సంవత్సరాలలో ఒక్కసారి అయినా రాజకీయ నాయకులు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల గడప తొక్కారా,విద్యార్థుల బాధలు అడిగి తెలుసుకున్నారా లేదా? అని ప్రశ్నించారు. ఎందుకంటే వారికి ఓట్లు లేవు ఉంటే గడప గడపకు స్కూల్స్ అని అనేవారేమో అని అన్నారు. అలాగే కొన్ని స్కూల్స్ లో 8వ తరగతి విద్యార్థినిలకు ఈరోజు వరకు ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్ లు టీచర్స్ వాడుకుంటున్నారని వాటిని విద్యార్దినిలకు ఇవ్వలేదని ఆరోపించారు.8 నుండి 10 వరకు చదివే విద్యార్థినీ,విద్యార్థులకు విద్యను బోధించే తెలుగు ఉపాధ్యాయులు సంవత్సరం నుండి లేరని,ఇంగ్లీష్ మీడియం చేసాము అని అన్నారు కానీ ఇంగ్లీష్ లో బోధించే ఉపాధ్యాయులను మరిచారని అన్నారు.ఇప్పటి వరకు ఉన్న తెలుగు టీచర్స్ కి ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా ఇంగ్లీష్ లో బోధించమంటే ఎలా బోధిస్తారన్నారు. కాకరపాడు లో ఉన్న కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్,కస్తూరిభా గాంధీ కళాశాలలో తెలుగు లెక్చరర్ లేరని,కాలేజ్ లో రెండు సబ్జెక్ట్స్ కి ఒక లెక్చరర్ పాఠాలు బోధిస్తున్నారని,కొన్ని స్కూల్స్ లో ఒక సబ్జెక్ట్ కు రెండు పాఠశాలలకు వెళ్లి ఒక ఉపాధ్యాయుడు బోధిస్తున్నారని అన్నారు.ఇటువంటి విద్యను పూర్వం గురువు లేని విద్య గుడ్డి విద్య అనేవారు అని అన్నారు.
పిల్లలకు ఆరోగ్యం బాగోలేదు అంటే హెల్త్ అసిస్టెంట్ లేక వ్యాధుల బారిన పడి ఏజెన్సీ 11 మండలాలలో 30 మందికి పైగా విద్యార్థినీ,విద్యార్థులు మరణించారని,తల్లి దండ్రులు పిల్లలను చదివించాలి అంటే బయపడిపోయే పరిస్తితి నెలకొందని చెప్పారు.చింతపల్లి బీసీ హాస్టల్ లో 90 మంది విద్యార్థినిలకు ఒకే బాత్ రూమ్ ఉందని ఇవన్ని భవిష్యత్ తరాలకు సోపానాలుగా బావించొచ్చు అని అశోక్ లాల్,వెంకటరావు మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.