నిరుద్యోగులకు ఉద్యోగ అర్హత వయో పరిమితి పెంచాలి- జంపా వెంకట రమణ డిమాండ్.
వెంకటరమణ |
అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ పదవి విరమణ వయో పరిమితి పెంచడం వలన నిరుద్యోగులకు చాలా నష్టం వాటిల్లిందని, ఉద్యోగులకు గతంలో మాదిరిగానే పదవీ విరమణ సమయానికి జరిగి ఉంటే ఉద్యోగ కాలీలు ఏర్పడి ఉద్యోగ ప్రకటనలు వెలువడేవి. తద్వారా నిరుద్యోగులుకు ఉద్యోగావకాశాలు వచ్చి ఉండేవని,కానీ ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచడం వల్ల విరమణ కావాల్సి ఉన్న ఉద్యోగులు సర్వీసులు కొనసాగించాల్సి రావడంతో కాలీల సంఖ్య తగ్గి నిరుద్యోగుల బ్రతుకుల్లో బుగ్గి జల్లినట్టు అయిందని, పైగా నాలుగు, అయిదు సంవత్సరాలలో ఉద్యోగ వయో పరిమితి పూర్తి అయ్యేవాల్లు తీవ్రంగా నష్టోతున్నారని, దాదాపు ఒక తరం భవిష్యత్ నాశనం అవుతుంది. కనుక ప్రభుత్వం చేసిన తప్పుని ప్రభుత్వమే సరిదిద్దుకోవాలి కనుక నిరుద్యోగులకు ఉద్యోగ అర్హత వయో పరిమితి పెంచాలని టీడీపి ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి జంపా వెంకట రమణ డిమాండ్ చేసారు.