Breaking News

షర్మిల చింతపల్లి పర్యటన వల్ల ఒరిగేదేమి లేదు- వైసీపీ పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు.

0 15

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం: ఈరోజు కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షురాలు షర్మిల పాడేరు నియోజకవర్గం లోని చింతపల్లి లో పర్యటించడం వల్ల నియోజకవర్గ ప్రజలకు ఒరిగేదేమీ లేదని వైకాపా పార్టీ పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు.షర్మిల సమక్షంలో ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు చేరడంపై విశ్వేశ్వరరాజు ఖండించారు.విలువలు లేని నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని అన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న బుల్లిబాబు కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక సముచిత స్థానం కల్పించి రాష్ట్రంలో ట్రైకార్ చైర్మన్ గా చేశారని అన్నారు.అలాంటిది ఆనందించాలే తప్ప పార్టీని ధిక్కరించి పార్టీ మారడం సిగ్గుచేటు అని,పార్టీ మారినంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు పోయేదేమీ లేదని అన్నారు.
వైఎస్సార్ సీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు జగనన్న వెంటే ఉన్నారని,మళ్లీ పాడేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా మళ్లీ జగనన్న అవ్వడం ఖాయం అని అన్నారు. జి మాడుగుల మండల నాయకులు వైస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ,మండల పార్టీ అధ్యక్షులు నుర్మని మత్యకొండం నాయుడు,సర్పంచ్ కిముడు రాంబాబు,ఎంపీటీసీ గబ్బాడి సన్యాసిదొరా,సింగర్బ సూపర్ ఎంపీటీసీ పాంగి చిట్టిబాబు,సలబం ఎంపిటిసి కూడా చిన్నారావు,కించూరు సర్పంచ్ వంతల రాంబాబు, సీనియర్ నాయకులు మన్మధరావు,పండన్న,రామారావు,ప్రకాష్,బాలయ్య పడాల్,వెంకటరమణ,సాగిన లక్ష్మణ్ పడాల్,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.