Breaking News

రక్తదానం చేయండి, ప్రాణ దాతలుగా మారండి.

0 19

రక్తదానం చేయండి, ప్రాణ దాతలుగా మారండి.

అల్లూరి యూత్ ఆధ్వర్యంలో మే 7న ఇండియన్ రెడ్ క్రాస్,బ్లడ్ డొనేషన్ క్యాంప్.

బల్లా ప్రసాద్ 

(అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం):ఎంపీపీ బడుగు రమేష్ సౌజన్యంతో నిర్వహకులు బల్లా ప్రసాద్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 100 వ వర్ధంతి సందర్భంగా అల్లూరి యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిర మే 7న కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో ఏర్పాటు చేయబడుతుంది.కావున అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతిని పురస్కరించుకొని మహనీయుడు పేరున రక్తదానం చేసి మరొకరికి ప్రాణదానం చేయాలని అల్లూరి యూత్ బల్లాప్రసాద్,లకే సురేష్,నత్తూరు సోమన్నదొర,సురబోయిన చిన్ని,డి.శ్రీను,పాటి శేఖర్,జన్ని నాగేంద్ర,నానాజి,జి.లక్ష్మణ్,లాలం శేఖర్,కె. రాజు,డిఏ కె.ప్రసాద్ వాసు,జి.చిన్ని,డి.కిరణ్ తెలిపారు.

మనం చేసే మంచి వలన మరొకరికి మనకు తెలియకుండా ప్రాణం పోసే గొప్ప అవకాశం రక్తదానం చేయడం వలన ఉంటుందని, కావున సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గ్రామాలలో ఉన్న యువకులు వివిధ డిపార్ట్మెంట్ లో పని చేసే సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛందంగా పాల్గొని మీయొక్క మానవత్వం మరొకసారి చాటుకోని 7వ తేది ఉదయం 10గంటలకు రాజేంద్రపాలెం పీహెచ్ సీ లో ఇండియన్ రెడ్ క్రాస్ అనిల్ సమక్షంలో నిర్వహించు రక్తదాన శిబిరంకు వచ్చి అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతికి వచ్చి ఘన నివాళులు అర్పించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.