Breaking News

దారి కాసి కర్రతో దాడి చేసి పరారైన దుండగులు.

0 20

 దారి కాసి కర్రతో దాడి చేసి పరారైన దుండగులు.

భూ వివాదాలే కారణమా?


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం నల్లగొండ పంచాయితీ లోని వైఎన్ పాకలు పరిధిలో..రావణాపల్లి పంచాయితీ తోటలూరు గ్రామానికి చెందిన నడిగట్ల రాము అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు దారి కాసి కర్రతో దాడి చేసి పరారయ్యారు.వైఎన్ పాకలు నుండి తన స్వగ్రామం అయిన తోటలూరు కి తన ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా కొందరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు.అయితే ఈ దాడికి భూ వివాదాలే కారణమా?

ఈ మధ్య నల్లగొండ పంచాయితీ వైఎన్ పాకలు పరిధిలో ఉన్న ఊరమెట్టగా పిలిచే కొండపోడుకు సంబంధించి గిరిజనులకు,గిరిజనేతరులకు మధ్య వివాదం జరుగుతుంది.తన భూమిని గిరిజనేతరులు అక్రమంగా ఆక్రమించారంటూ గిరిజనుడైన నడిగట్ల రాము కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు.ఇంతలో ఇలా జరగటం చూస్తుంటే ఈ దాడికి భూ వివాదాలే కారణమై ఉండొచ్చు అనే అనుమానం కలగకమానటంలేదు.రాము కూడా తనకు వేరే విధంగా ఎవరూ శత్రువులు లేరని,తన భూమిని ఆక్రమించుకున్న వ్యక్తులే ఇలా చేసి ఉండొచ్చని అంటున్నారు.వెంటనే చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు గొలుగొండ మండలంలోని కృష్ణాదేవిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.