Breaking News

కొయ్యూరు హైస్కూల్ జూనియర్ కాలేజ్ గా మహర్దశ.

0 644

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ఎన్నో సంవత్సరాలుగా ఉన్న తల్లిదండ్రుల,విద్యార్థుల కలను సాకారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి సహకారంతో అనేకమార్లు సంబంధిత మంత్రులను,అధికారులను అలాగే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని సహితం మండల సమస్యలలో ప్రధానంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చింతపల్లిలో జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే సమక్షంలో వినతిపత్రం అందించడం జరిగిందని ఎంపీపీ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానిని ఈరోజు సాకారం చేస్తూ
కొయ్యూరు మండలానికి జూనియర్ కళాశాలను మంజూరు చేయడం జాన్ లో ఇంటర్మీడియట్ విద్యార్థులను కొయ్యూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుందని అన్నారు.ఇప్పటికే విద్యాపరంగా అభివృద్ధి పదంలో నడపడం,నాడు-నేడు లో భాగంగా అనేక సంస్కరణలు చేపట్టడం,రాష్ట్ర ప్రభుత్వం పిల్లల భవిష్యత్తుకు కావాల్సిన ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంలో దేశం లోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము ముందు వరసలో ఉండటం దానికి జగనన్న ప్రభుత్వంలో నాడు-నేడు అనే కార్యక్రమం ఒక అద్భుతం అని అన్నారు.వైయస్సార్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో జూనియర్ కాలేజ్ రావడం వల్ల రుణపడి ఉంటామని ఎంపీపీ చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జల్లి బాబులు,కన్వీనర్‌ బండి సుధాకర్,వనంబాబు,పాటి శేఖర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.